One of my students dedicated this poetry to me...
చిన్న మదిలో చిగురించే చిన్నారుల స్వప్నాలను చిరు కాంతిగా వెలిగిస్తూ.,
చిరకాలపు గమ్యాలకు చిన్న బాటను వేసినావు..
మా మదిలో మెదిలేటి మలినాలను కడిగేసి.,
ఘన జీవిత శిఖరాలను కనులతోనే చూపినావు..
ఆనందపు పార్శ్వాలను హాయిగా అందించుచు.,
అనంతమగు జ్ఞానమునకు హరతులే పట్టినావు..
పర భాష విజ్ఞానం నీవిచ్చిన మధుర ఫలం.,
పరుల తోడ సంస్కారం నీవు నేర్పిన గొప్ప గుణం..
చినుకు చినుకును కలిపి వర్షంలా మార్చుటకు.,
ఈ చిన్నారుల చదువుకై వచ్చిన చిరు దివ్వెవు నీవు.,
ఆశలు,ఆశయాలను నెరవేర్చుటకు ఆయువుగా దొరికిన ఆశాఖ్యాతివి నీవు.,
పిల్లలలోని "ప్రతిభ"ను వేయి రెట్లు పెంచునట్టి పుష్కల ప్రతిభా పాటవం నీది..
నీ జీవిత గమ్యముకై పరదేశపు పయనములో, పది ఇంతలు మేలు జరిగి ఘన పడతిగా పేరు పొంది,"ప్రతిభా" నామము ప్రతిమగా వెలుగొంది,ప్రతి కుసుమాలను చిగురించ, ఆ పరమేశ్వరుని నే పరమ భక్తి తోడ పలు విధములుగా ప్రార్థించుచు, పదములుగా రాస్తుండిని.
Thankyou thankyou thankyou for gifting this to me ...But my sincere thanks to the one that actually wrote this even without seeing me...One must really see things with their heart to come up with such beautiful words. My respect and gratitude for artists and writers has only increased after seeing such fine lines. Thanks again.
Wednesday, June 30, 2010
Subscribe to:
Comments (Atom)